ప్రకాశం: పామూరు మండలం బొట్లగూడూరు గ్రామంలో మన్నేపల్లి వంశస్థుల ఆధ్వర్యంలో గురువారం నాగర్పమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్ధన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.