SRPT: జిల్లాలో ఈనెల 8న జరిగే సీపీఐ జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి తొట్ల ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం నూతనకల్‌లో మహాసభ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహిస్తున్న మహాసభలకు ఎమ్మెల్యే సాంబశివరావు, పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యం హాజరవుతారన్నారు.