కృష్ణా: మచిలీపట్నం బందర్ బైపాస్ రోడ్డు నందు ఆటో, డీసీఎం ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ గాయపడి రోడ్డుపై పడి ఉండగా అటుగా వస్తున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్వయంగా తన కారులో బందర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి కుటుంబ సభ్యులు ఆపదలో ఆదుకున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.