ఊర్లో మేకలతో వీడియోలు చేస్తూ ఓ యువకుడు ఏకంగా ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని మహద్ గ్రామంలో ఓ యువకుడు భాగ్యశ్రీ హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. తన హోటల్ విషయాలతోపాటు తన మేకలకు ఆహారం పెట్టడం వంటి వీడియోలు తీస్తూ.. 40 లక్షల విలువైన ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేశాడు. దీంతో నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.