HNK: హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో నాటడానికి తీసుకువచ్చిన మొక్కలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని నగరవాసులు మండిపడుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకులు, అధికారులు పబ్లిక్ గార్డెనను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పాలకవర్గం, అధికారులు దృష్టి సారించి మొక్కలను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.