ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో నెలకొన్న డబ్బు వివాదంలో హీరో విశాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. సదరు సంస్థకు 30% వడ్డీతో రూ.21 కోట్లు చెల్లించాలని అతనికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకుని.. తిరిగి ఇవ్వలేదని లైకా 2022లో కోర్టును ఆశ్రయించింది.