VZM: పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతని గజపతినగరం ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జెడ్పీటీసీ గార తౌడు అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. మనిషి మనుగడకు, కాలుష్యం నివారణకు మొక్కలు పెంచాలన్నారు. ఇందులో ఎంపీడీవో కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.