SKLM: పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈనెల 19వ తేదీ నుండి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఎంఈవో బమ్మిడి మాధవరావు తెలిపారు. బుధవారం జలుమూరు మండలం కరవంజ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హెచ్ఎం ప్రసాదరావు హాల్ టికెట్లను పంపిణీ చేశారని తెలియజేశారు. ఈ క్రమంలో మండలం నుండి 62 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వివరించారు.