మన్యం: సాలూరులో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు పెద్దఎత్తున జరగనున్న శ్యామలాంబ తల్లి అమ్మవారి జాతరను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. శ్యామలాంబ జాతర నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 15ఏళ్ల తరువాత జరుగుతున్న జాతరను ఘనంగా నిర్వహించాలన్నారు.