VZM: ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఈనెల 16న భోగాపురంలో జరగనున్న లబ్ధిదారుల ఇంటర్వ్యూలను వాయిదా వేసినట్లు ఎంపీడీవో కిషోర్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16న ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు సిద్ధమయ్యామని, కొన్ని కారణాల వలన వాయిదా వేశామన్నారు. తదుపరి తేదీను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.