NLR: ఇనమడుగు మిని ఆటోనగర్ కార్మిక సోదరులకు ప్రభుత్వం తరుపున ఏ అవసరం వచ్చిన నేను అండగా ఉంటానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుధవారం కోవూరు మండలం ఇనమడుగు సెంటర్లో “ఇనుమడుగు సెంటర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్” పేరిట ఏర్పాటు చేసుకున్న మిని ఆటోనగర్ నిర్మాణ భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు.