AP: రాష్ట్రంలో మున్సిపల్ ఛైర్మన్ల తొలగింపు పరంపర కొనసాగతోంది. తాజాగా మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ కిషోర్‌ను ప్రభుత్వం తొలగించింది. ఛైర్మన్ పదవి దుర్వినియోగం చేశారని కిషోర్‌పై ఆరోపణలు వచ్చాయి. అనుమతి లేకుండా వరుసగా 15 కౌన్సిల్ భేటీలు గైర్హాజరు అయ్యారని ఆరోపణలు రావడంతో మున్సిపల్ చట్టం 16(1) ఉల్లంఘించారని ఆయనపై వేటు వేసింది. కాగా కడప మేయర్ సురేష్‌పై కూడా అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.