PLD: జిల్లా పరిధిలోని అక్రమ లే అవుట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 183 అనధికార లే అవుట్లు గుర్తించగా, వాటిలో 86 లేఅవుట్లను 22ఎ ప్రకారం రిజిస్ట్రేషన్ నుంచి మినహాయించేందుకు కమిషనర్, స్టాంప్స్ శాఖకు పంపారు. మిగిలిన 97 లే అవుట్లను సబ్ డివిజన్లుగా మంజూరు చేయాలని పంపగా తిరస్కరణ వచ్చింది.