ELR: భీమడోలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం మండలంలోని పెదలింగంపాడులో వేడుకకు హాజరైన నలుగురు తిరుగు ప్రయాణంలో కాలకృత్యాల కోసం కోమటిగుంట చెరువు వద్ద ఆగారు. ఈ క్రమంలో ప్రమాద వశాత్తూ చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులు పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన అజయ్ (28), అభిలాష్ (16), సాగర్ (16)గా గుర్తించారు.