KMR: కామారెడ్డి పట్టణానికి చెందిన నిరుపేద యువతి గీతాంజలి వివాహం సందర్భంగా పట్టణానికి చెందిన అయిత బాలచంద్రం గుప్తా వధువుకు పుస్తె, మట్టెలను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు 26 మంది వధువులకు పుస్తె, మట్టెలను వితరణ చేసినట్లు తెలిపారు. ఎవరైనా నిరుపేద యువతులు వివాహం చేసుకుంటే పుస్తె, మట్టెలను వితరణ చేస్తానని చెప్పారు.