NDL: నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కలిశారు. బుధవారం అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని సాగునీటి సమస్యల గురించి చర్చించినట్లు తెలిపారు. ఇందులో మార్కెట్ యార్డు చైర్మన్ ప్రసాద రెడ్డి, మహేశ్వర రెడ్డి ఉన్నారు.