భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తత పరిస్థితుల్లో పాక్‌కు టర్కీ సహాయం చేయడంతో ఉదయపూర్ మార్బుల్ ట్రేడర్స్ టర్కీ నుంచి రాయిని దిగుమతి చేసుకోవడం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, వారు ప్రధాని మోదీకి లేఖ రాశారు. తమ నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేసి టర్కీ మార్బుల్ దిగుమతులపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని కోరారు. కాగా, నిన్న టర్కీ యాపిల్‌ను నిషేధించారు.