NZB: ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద వరి కొనుగోలు వెంటనే చేయాలని రైతులు బుధవారం ధర్నా నిర్వహిస్తున్నారు. మంగళవారం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. వరికోత ప్రారంభమై ఇప్పటి వరకు నెల రోజులు అవుతున్న అధికారులు రైతులను పట్టించుకోవడం లేదన్నారు.