HYD: హైదరగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.