JN: తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్ గా మొలుగూరి యాకయ్య గౌడ్, కో కన్వీనర్‌గా నల్లమాస రమేష్, నియోజవర్గ కన్వీనర్‌గా సంగి వెంకన్న యాదవ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇవ్వాలన్నారు.
HNK: కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జయరాజు కన్నూరు సైక్లింగ్ క్లబ్ కేరళ వారు నిర్వహించిన 30 రోజులలో 1000 కి.మీ సైక్లింగ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. ఈ మేరకు శనివారం హెడ్ కానిస్టేబుల్‌ను కాజీపేట ఏసిపి తిరుమలరావు అభినందించి సైక్లింగ్ క్లబ్ వారు ప్రధానం చేసిన మెడల్‌తో సత్కరించారు.
MHBD: నరసింహులపేట మండలం కౌసల్యదేవిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అందరూ ఒక చోట చేరి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై చర్చించారు. ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ఆదేశాల మేరకు త్వరలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటుతామని వారు తెలిపారు.
మేడ్చల్: సంక్రాంతి పండగ సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో ఉప్పల్ రింగ్ రోడ్డు సందడిగా మారింది. ఉప్పల్ పాయింట్ నుంచి 1,200 బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. నిన్న ఒక్కరోజే 400 బస్సు నడిచాయి. ఈ రోజు సుమారు 500 వరకు వెళ్లనున్నాయి. స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా సీట్ల కోసం ప్రయాణికులు పోటీ పడ్డారు.
HYD: తార్నాక డివిజన్ BJP ప్రెసిడెంట్‌గా ఉపేందర్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డిని తార్నాకలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి ఉపేందర్ యాదవ్‌ను శాలువాతో సన్మానం చేశారు. తార్నాక డివిజన్‌కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
SRCL: అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి పరికరాలివ్వడమే తన లక్ష్యమని, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకం కింద, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో రూ. 69లక్షల 54వేల 911 రూపాయల విలువైన 675 ఉపకారణాలను 322 మంది దివ్యాంగులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి పంపిణీ చేశారు.
ADB: ఆదివాసుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. శనివారం మధ్యాహ్నం ఉట్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివాసుల అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేయడం సరికాదన్నారు.
ASF: భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా జిల్లాలోని అన్ని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల తేదీ 11 నుంచి 15 వరకు క్రయవిక్రయాలు జరగవన్నారు. రైతులు ఈ విషయాన్నీ గమనించి సహకరించాలని కోరారు.
హత్నూర మండలం బోరపట్ల మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటులో పని చేస్తున్న కార్మికులకు ధర్నా బాట పట్టారు. కనీస వేతనం చెల్లించడం లేదు, ESI, PF సౌకర్యాలు లేవు. గతా 5 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, పెండింగ్‌లోని జీతాలు వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు.
SRD: కంగ్టి మండలం MRPS అధ్యక్షుడు విజయ్ కుమార్ తదితరులు హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే కంగ్టి మండలం MRPS అధ్యక్ష పదవి చేపట్టిన విజయ్‌ను ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మాదిగల హక్కుల పోరాటానికి మాదిగలను సంఘటితం చేయాలని, ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మందకృష్ణ మాదిగ సూచించారన్నారు.
MNCL: భీమారం మండల కేంద్రంలో నిషేధిత చైనా మాంజా విక్రయించరాదని ఎస్ఎస్ శ్వేత సూచించారు. మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాలలో పోలీస్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నిషేధిత చైనా మాంజా వాడటం వలన ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోతున్నాయని, మరియు వాహనదారులు తీవ్రంగా గాయపడి చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
NLG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యిందని మాజీ ఎమ్మెల్యే, BRS జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగే రైతు ధర్నాకు మాజీ మంత్రి KTR రానున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
SRD: నిషేధిత ఆల్ఫాజోలం తయారు చేస్తూ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసినట్లు ఎస్పీ రూపీస్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీనితోపాటు అక్రమంగా 60 కోట్ల రూపాయల ఆస్తులు కూడా కూడబెట్టినట్లు చెప్పారు. ఈ ముఠాను పట్టుకున్న గుమ్మడిదల పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు.
SRPT: తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 8వవార్డు పీఏసీఎస్ డైరెక్టర్ వజ్జ శంకర్ యాదవ్ మరణించడంతో ఆమె పార్థివదేహానికి శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ శాగంటి అనసూయ రాములు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు సుంకరి జనార్ధన్, ఎల్సొజు నరేష్, పేరాల వీరేష్, జుమ్మిలాల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.