• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సిర్గాపూర్‌లో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో BJP నాయకులకు పోలీసులు నేడు ముందస్తు అరెస్టు చేశారు. BJP తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలి వెళ్తున్న మండల పార్టీ అధ్యక్షుడు బిరాదర్ శంకర్ పాటిల్, శ్రీనివాస్ పాటిల్ తదితరులకు హైదరాబాద్‌కు వెళ్లనివ్వకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువ మోర్చా అధ్యక్షుడు యాదగిరి ముదిరాజ్, బిక్షపతి ఉన్నారు.

March 23, 2026 / 09:30 AM IST

‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తోంది’

MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ఈనెల 24లోపు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదని మాజీ MLA, BRS జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తోందని, దీనిపై త్వరలో గవర్నర్‌ను కలుస్తామన్నారు. అవసరమైతే కోర్టు దిక్కరణ కింద మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

March 23, 2026 / 09:29 AM IST

ఉండవెల్లిలో హిందూ సమ్మేళనం

GDWL: ఉండవెల్లి మండలంలోని శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 29న ‘హిందూ సమ్మేళనం’ నిర్వహించనున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చల్లా దామోదర్ రెడ్డి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీ అనంత ఆనంద భారతి స్వామీజీ, RSS ప్రచారక్ శ్రీ దేవేంద్ర జీ ప్రముఖ వక్తలుగా హాజరుకానున్నారు.

March 23, 2026 / 09:25 AM IST

బీజేపీ మండలాధ్యక్షుల ముందస్తు అరెస్టు

NZB: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నిజామాబాద్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. బోధన్, సాలూర మండలాల బీజేపీ అధ్యక్షులు సిర్పా సుదర్శన్, రావుబా గంగాధర్లను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు.

March 23, 2026 / 09:21 AM IST

మహబూబ్‌నగర్‌లో ఉచిత ప్రవేశ పరీక్షలు

మహబూబ్‌నగర్‌లోని ఒక కళాశాలలో PPT, UTF సంస్థల సహకారంతో 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ విద్య అందించడం ఎంతో గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులకు హైదరాబాద్‌లోని ట్రస్ట్ పాఠశాలలో ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు.

March 23, 2026 / 09:18 AM IST

వరి కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి వరి కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 250కి పైగా కేంద్రాలు ఏర్పాటు కాగా, జిల్లాలో అధికంగా ఉన్నాయి. సాధారణ వడ్లకు రూ. 2,300, గ్రేడ్-ఏకు రూ. 2,320 ధరలు నిర్ణయించారు. సన్న వడ్లకు రూ. 500 బోనస్ కోసం ఈ-కేవైసీ కొనసాగుతోంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

March 23, 2026 / 09:18 AM IST

పేకాట స్థావరంపై దాడి.. ఆరుగరు అరెస్ట్

MDCL: కూకట్‌పల్లిలో పేకాట స్థావరంపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. నిర్మానుష ప్రదేశంలో పేకాటాడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారినుంచి రూ.23 వేలు స్వాధీనం చేసుకున్నారు. జూదరులను కూకట్‌పల్లి PSకు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 23, 2026 / 09:15 AM IST

తూర్పుపల్లి PHCలో నేడు ఉచిత మెగా హెల్త్ క్యాంప్

NLG: దేవరకొండ నియోజకవర్గంలోని తూర్పుపల్లి PHC హాస్పిటల్లో రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనుంది. ఈ క్యాంపులో గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, జనరల్ డాక్టర్, డెంటల్, ఆప్తమాలజిస్ట్ వంటి నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారు.

March 23, 2026 / 09:15 AM IST

లాడ్జిల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

MHBD: కురవి మండల కేంద్రంలోని గుడి పరిసరాల్లో ఉన్న పలు లాడ్జీలను ఎస్సై గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. తాళలు వేసిన గదులు, గదుల్లో ఉన్న వ్యక్తుల ఆధార్ కార్డులు, రికార్డులో ఉన్న వాళ్ళ పేర్లను పరిశీలించారు. లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 23, 2026 / 09:11 AM IST

బహిరంగ మద్యపానం.. ఇద్దరిపై కేసు: CI

ఆదిలాబాద్‌లోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ వద్ద బహిరంగంగా మద్యం తాగిన ఇద్దరిని పట్టుకున్నట్లు CI సునీల్ తెలిపారు. సంజయ్ నగర్‌కు చెందిన పెట్ల రన్వీర్, జగదీష్‌పై FIR నమోదు చేశామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 23, 2026 / 09:06 AM IST

బీజేపీ నేత ముందస్తు అరెస్ట్

BDK: పినపాక బీజేపీ మండల అధ్యక్షుడు ధూళిపూడి శివప్రసాద్‌ను పోలీసులు ముందస్తుగా నిన్న రాత్రి అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో హైదరాబాద్‌కు వెళ్లకుండా అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు చట్టశాంతి దృష్ట్యా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 23, 2026 / 09:06 AM IST

విశ్వగురు వరల్డ్ రికార్డ్ అందుకున్న పెనుబల్లి యువకుడు

KMM: పెనుబల్లి మండలానికి చెందిన బర్మావత్ మోతి కుమార్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటి విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. పర్వత అధిరోహణలో తన ప్రతిభను నిరూపిస్తూ దక్షిణాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, రష్యాలోని మౌంట్ ఎలూస్ వంటి ప్రముఖ శిఖరాలను విజయవంతంగా అధిరోహించారు. ఈమేరకు ఆయనకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అవార్డును ప్రముఖులు నిన్న విశాఖపట్నంలో అందజేశారు.

March 23, 2026 / 09:05 AM IST

ఉపాధి కూలీలకు వేతనాలు అందించాలి

WGL: జిల్లా వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు 2 నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసినప్పటికీ చెల్లింపులు ఆలస్యం కావడంతో అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కూలీలు కోరారు.

March 23, 2026 / 09:04 AM IST

జమ్మికుంటలో బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

KNR: అసెంబ్లీ సమావేశాలను ముట్టడించనున్న బీజేపీ నాయకులను జమ్మికుంట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హామీల అమలు కోసం ప్రశ్నించడానికి వెళ్తున్న తమను రాజ్యాంగ విరుద్ధంగా అరెస్ట్ చేయడం సారి కాదన్నారు.

March 23, 2026 / 09:04 AM IST

నడిగూడెంలో బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

SRPT: రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు ‘అసెంబ్లీ ముట్టడి’కి వెళ్లకుండా నడిగూడెం పోలీసులు ఇవాళ ఉదయం బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బండారు వీరబాబు యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేదని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

March 23, 2026 / 09:01 AM IST