BDK: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ఈనెల 17, 18వ తేదీల్లో చండ్రుగొండ, అశ్వరావుపేట మండలాల్లో పర్యటిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం ప్రాజెక్టు సందర్శించిన, అనంతరం గ్రామంలోని గిరిజనులకు సంబంధించిన పోడు పట్టా భూములను పరిశీలించి గిరిజన రైతులతో సమావేశం అవుతారన్నారు.
SRPT: కోదాడలో రేపటి నుంచి మూడు రోజులపాటు జరిగే పెన్షనర్ల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను పెన్షనర్లు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య కోరారు. శనివారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డితో కలిసి వారు మాట్లాడారు.
NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో మునిసిపల్ కమిషనర్ వై. సుదర్శన్ అధ్యక్షతన అన్ని విభాగాల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్నులు, నీటి కులాయిల బిల్లులు, వాణిజ్య లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా సహకరించి బిల్లులు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని పట్టణ ప్రజలను కోరారు.
KMM: విద్యార్థులంతా ఆత్మ విశ్వాసంతో అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం కొణిజర్ల (మం) పెద్దమునగాల ZPHS పాఠశాలలో వుయ్ కెన్ లెర్న్ ఇంగ్లీష్ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పిల్లలకు మంచి విద్య అందించడమే ప్రభుత్వం యొక్క అత్యంత ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.
NGKL: వేసవికాలం తీవ్రత దృష్ట్యా విధుల్లోఉన్న డ్రైవర్లు, కండక్టర్లకు మార్చి15 నుంచి మజ్జిగ పంపిణీ చేయాలని ఆర్టీసీMD సజ్జనార్ ఆదేశించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం డిపో మేనేజర్ యాదయ్య విధుల్లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. జేఆర్ రెడ్డి, పిఎస్ రావు, జయప్రకాష్, నారాయణ, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
MBNR: హన్వాడ మండలం మాదారం రామకొండపై కొలువుదీరిన శ్రీ తిరుమలనాథస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకోని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరిపై స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు శేషవస్త్రం సమర్పించారు.
WNP: పీర్లగుట్ట డబల్ బెడ్ రూమ్ కాలనీని శనివారం సీపీఎం పట్టణకమిటీ ఆధ్వర్యంలో సందర్శించారు. టౌన్ సెక్రెటరీ పరమేశ్వరచారి మాట్లాడుతూ.. వీధిలైట్లు, రోడ్లు, తాగునీరు సౌకర్యాలు లేక కాలనీవాసులు అవస్థలు పడుతున్నారన్నారు. 1వ బ్లాక్ దగ్గర ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ రోడ్డుకు సమానంగా ఉండడంతో ప్రమాదకరంగా మారిందన్నారు. వెంటనే ఎత్తుపెంచి కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
MBNR: పట్టణం సమీపంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న జంతు వధశాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని కోయిల్ కొండ రోడ్డు వద్ద నూతనంగా నిర్మిస్తున్న జంతు వధశాల నిర్మాణ పనులను శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలస్యం లేకుండా సకాలంలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావలన్నారు.
నారాయణపేట: పంచాయతీ కార్మికులకు వేతనాలు అందటం లేదని శనివారం నారాయణపేట పట్టణంలో టీయుసీఐ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహులు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వున్న పంచాయతీ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ADB: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. శనివారం మధ్యాహ్నం ఉట్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను ఖానాపూర్ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాల అమలు చేస్తుందని వివరించారు.
KMM: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటన మధిర మండలంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర మండల కేంద్రంలోని శాంతి థియేటర్ సమీపంలో ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NZB: నిజామాబాద్ జిల్లాకు నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్యను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో లా& ఆర్డర్ అదుపు చేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపి యువతను బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
MDK: జిల్లాలోని పాపన్న పేటకు చెందిన అర్జున్ రెడ్డి గ్రూప్-3 స్టేట్ టాపర్‌గా నిలిచాడు. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో ఆయన 339 మార్కులతో స్టేట్ ప్రథమ ర్యాంక్ సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-2లో స్టేట్ 18వ ర్యాంక్ సాధించారు. ఈయన ఇంజినీరింగ్ చేసి, ప్రస్తుతం హవేలీ ఘనపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.
KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సింగరేణి సీఎండీని హైదరాబాద్‌లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సింగరేణి సీఎండీ కిష్టారం బ్లాస్టింగ్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అదే విధంగా సింగరేణి సైలో బంకర్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు.
KMM: జిల్లాలో ఈ వేసవిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలు రూపొందించినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసచారి వెల్లడించారు. శనివారం వారి కార్యాలయం నుంచి మాట్లాడుతూ..విద్యుత్ అంతరాయం కలగకుండా 24/7 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేసామని అన్నారు. వీరు నిరంతరం విద్యుత్ కోతలపై పర్యవేక్షిస్తారని తెలిపారు.