• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

BHNG: ఆలేరు మున్సిపల్ లోని 6వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను మున్సిపల్ ఛైర్ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ బుధవారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని లబ్ధిదారులను కోరారు. అనంతరం వార్డులో పారిశుద్ధ్య పరిస్థితిని అధికారులు, సిబ్బందితో కలిసి చూశారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ అంగడి ఆంజనేయులు, కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

March 25, 2026 / 02:30 PM IST

వీర హనుమాన్ విజయయాత్రకు ఆహ్వానం

JGL: మల్లాపూర్ మండల కేంద్రంలో ఈనెల 31 తేదీన జరగబోయే వీర హనుమాన్ విజయయాత్రను విజయవంతం చేయాలని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు కోరారు. బుధవారం వేంపల్లిలోని హనుమాన్ భక్తులకు, హిందూ బాంధవులు కరపత్రాలు పంచి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మండల బజరంగ్ దళ్ నాయకులు, గ్రామ సర్పంచ్ రాజేందర్, ఉపసర్పంచ్ హారిక, ప్రసాద్, హనుమాన్ స్వాములు పాల్గొన్నారు.

March 25, 2026 / 02:29 PM IST

రైతు శ్రేయస్సు లక్ష్యంగా పనిచేయాలి: జిల్లా కలెక్టర్

PDPL: రైతు శ్రేయస్సే లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఫార్మర్ రిజిస్ట్రీని 85% వరకు పూర్తి చేయాలని, పీఎం కిసాన్ ఈ-కేవైసీ వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. రైతుబీమా అమలులో వేగం పెంచి కుటుంబాలకు సహాయం అందించాలన్నారు. వానాకాలానికి యూరియా సరఫరా ప్రణాళిక సిద్ధం చేయాలని, సాగు పద్ధతి పై అవగాహన కల్పించారు.

March 25, 2026 / 02:28 PM IST

‘మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం’

ADB: మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం ఉట్నూర్ మండలం దంతన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును సందర్శించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

March 25, 2026 / 02:28 PM IST

లింబాద్రిగుట్ట ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

NZB: భీమగల్ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి, దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లుఆలయధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. దేవాదాయశాఖసహాయ కమిషనర్ విజయ రామారావు సమక్షంలో లెక్కింపుజరిగిందన్నారు. హుండీ ద్వారా రూ. 4,98,491,అన్నదానం హుండీ ద్వారా రూ. 1,99,295 ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. మొత్తం రూ. 6.97లక్షల ఆదాయాన్ని ఆలయ ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు.

March 25, 2026 / 02:26 PM IST

‘ప్రజా ప్రభుత్వంలోనే సొంత ఇంటి కళ నెరవేరుతుంది’

BHPL: ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని మున్సిపల్ ఛైర్మన్ బుర్ర కొమురయ్య అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ 29వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అరువైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

March 25, 2026 / 02:25 PM IST

ధ్వజ శిఖర ప్రతిష్టాపనలో పాల్గొన్న MLA

ASF: రెబ్బెన మండలం దేవాలగూడ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం విగ్రహ, ధ్వజ శిఖర ప్రతిష్టాపన జరిగింది. మహోత్సవంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి, కనకదుర్గాదేవి, లక్ష్మీ గణపతి, నవగ్రహాలు, జంట నాగదేవతల ప్రతిష్టాపన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.

March 25, 2026 / 02:23 PM IST

జాబ్ మేళాకు దరఖాస్తు చేసుకోండి: CP

SDPT: జిల్లా పోలీస్ యంత్రాంగం ‘ఉద్యోగ మిత్ర’ పేరిట జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తోందని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఓ ప్రకటనలో తెలిపారు. docs.google.com/forms/d/e/1FAI ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అన్ని రకాల విద్యార్హతలకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

March 25, 2026 / 02:21 PM IST

తీగల యాదమ్మకు ఘన నివాళులు

MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు చెందిన సీనియర్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు తీగల ఆంజనేయులు తల్లి తీగల యాదమ్మ బుధవారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ వారి నివాసానికి చేరుకుని, యాదమ్మ భౌతికకాయానికి పూలమాలలు అర్పిస్తూ ఘనంగా నివాళులు సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

March 25, 2026 / 02:20 PM IST

నీటి విడుదల.. రాకపోకలు బంద్

GDWL: దిగువ జూరాల జెన్కో యూనిట్ల నుంచి టర్బైన్ల ద్వారా భారీగా నీటిని విడుదల చేయడంతో గద్వాల – ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ఉద్ధృతి పెరగడంతో ప్రయాణికుల రక్షణార్థం పోలీసులు బుధవారం రోడ్డును మూసివేశారు. కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైన ఈ దారి మళ్లీ మూతపడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

March 25, 2026 / 02:20 PM IST

పాఠశాల భవనాలు ఆక్రమిస్తే చర్యలు: MEO

SRD: పాఠశాల పురాతన భవనాలు విద్యాశాఖ సొత్తు అని, కూల్చిన ఆక్రమించిన చట్టరీత్య చర్యలు తీసుకుంటామని ఇవాళ సిర్గాపూర్ MEO శ్రీనివాస్ హెచ్చరించారు. పాత భవనాలను రక్షించుకునే బాధ్యత ప్రజలదని, స్థలాలను అన్యాక్రాంతం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. గరిడేగాంలో పాత స్కూల్ బిల్డింగ్ ఆక్రమణకు కొందరు చేస్తున్న యత్నాలు విరమించుకోవాలని HM భవనానికి నోటీసు అతికించారు.

March 25, 2026 / 02:19 PM IST

“కామ్రేడ్ రాము వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి”

MHBD: ఆదివాసీ లిబరేషన్ టైగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు కామ్రేడ్ కుంజ రాము 22వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు సువర్ణపాక వెంకటరత్నం కోరారు. ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడ(M)మోకాళ్ళపల్లి గ్రామంలో మార్చి 27న నిర్వహించనున్న వర్ధంతి సభకు ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొని ఘన నివాళులర్పించాలని కోరారు.

March 25, 2026 / 02:17 PM IST

‘లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాడుదాం’

HNK: లేబర్ కోట్లను రద్దు చేసేంతవరకు పోరాడుదామని CPM జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని హనుమకొండ కలెక్టరేట్ ఎదుట CPI నేతలు నిరసన చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకుని కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

March 25, 2026 / 02:16 PM IST

ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్

జనగామ జిల్లాలోని శామీర్ పేట్ గ్రామంలో కలెక్టర్ సందీప్ కుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పర్యవేక్షించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటికి ఎంత ఖర్చు అయ్యింది..? నిర్మాణం జరిగిన తీరు, అలాగే సొంత ఇంటి కల నెరవేరడంతో వారి అభిప్రాయాలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో ఆయనతోపాటు DSCDO విక్రమ్, హౌసింగ్ పీడీ మాతృనాయక్, తదితరులున్నారు.

March 25, 2026 / 02:14 PM IST

ఒక్కో రేషన్ షాపులో 100 క్వింటాల కెపాసిటీ

MDCL: కాప్రాలో వచ్చే నెల మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీలో భాగంగా అధికారులు రేషన్ దుకాణాలకు ఒక్కొక్కరికి 18 కిలోల చొప్పున పంపిస్తున్నట్లు తెలిపారు. రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కాప్రా పరిధిలోకి స్టాకు వస్తుందన్నారు. నూతనంగా రేషన్ కార్డులు వచ్చిన వారికి సైతం అందిస్తామని పేర్కొన్నారు. రేషన్ దుకాణంలో సుమారు 100 నుంచి 150 క్వింటాల కెపాసిటీ ఉంది.

March 25, 2026 / 02:13 PM IST