MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు చెందిన సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తీగల ఆంజనేయులు తల్లి తీగల యాదమ్మ బుధవారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ వారి నివాసానికి చేరుకుని, యాదమ్మ భౌతికకాయానికి పూలమాలలు అర్పిస్తూ ఘనంగా నివాళులు సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.