PDPL: రైతు శ్రేయస్సే లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఫార్మర్ రిజిస్ట్రీని 85% వరకు పూర్తి చేయాలని, పీఎం కిసాన్ ఈ-కేవైసీ వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. రైతుబీమా అమలులో వేగం పెంచి కుటుంబాలకు సహాయం అందించాలన్నారు. వానాకాలానికి యూరియా సరఫరా ప్రణాళిక సిద్ధం చేయాలని, సాగు పద్ధతి పై అవగాహన కల్పించారు.