GDWL: బకాయి బిల్లుల చెల్లింపు, ఉద్యోగ భద్రత డిమాండ్లతో హైదరాబాద్‌లో జరగనున్న ‘మహా ధర్నా’కు బుధవారం మాచర్ల చేనేత కార్మికులు తరలివెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు తీరని పక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.
NGKL: ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ‘తెలంగాణ అమర్నాథ్’ సలేశ్వరం జాతరపై ఫారెస్ట్ అధికారులు భక్తులకు మార్గదర్శకాలు జారీ చేశారు. అడవిలో చెత్త వేయకూడదని, చెట్లు నరకరాదని సూచించారు. సిగ్నల్స్ ఉండవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, వెంట నీళ్ల బాటిల్స్, పండ్లు తెచ్చుకోవాలని కోరారు. అడవిని కాపాడటంలో భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
యాదాద్రి: కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేస్తారన్న నేపథ్యంలో మోత్కూర్ కొత్త అసెంబ్లీ నియోజకవర్గంగా మారుతుందనే చర్చ కొనసాగుతుంది. మోత్కూర్, అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూర్, మండలాలను కలిపి దీనిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నాలుగు మండలాలలో కలిపి సుమారు 1,80,000 పైగా జనాభా ఉండడంతో రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది.
PDPL: 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో పెద్దపల్లి పట్టణ ప్రజలు బకాయి ఉన్న ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, ట్రేడ్ లైసెన్స్ రుసుములను మార్చి 31లోపు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ సూచించారు. ఈ సందర్భంగా వందన ట్రేడర్స్ యజమాని రూ. 1,10,236 పన్ను బకాయిని చెక్కు రూపంలో కమిషనర్‌కు అందజేశారు. టీపీవో, జూ. అసిస్టెంట్ రమాకాంత్, బిల్ కలెక్టర్ అజయ్ పాల్గొన్నారు.
KNR: తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గోదారి శోభారాణి కాంగ్రెస్ పార్టీలో చేరగా మంగళవారం ఆమెకు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా నిధులు కేటాయిస్తున్నందునే పలువురు ప్రజాప్రతినిధులు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.
HYD: నగరంలో కాలుష్యం పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నగరంలోని రామేశ్వరం బండలో AQI 179గా నమోదైంది. వాహనాల పొగ, చెత్త దహనం ఎయిర్ పొల్యూషన్‌కు ప్రధాన కారణాలుగా అధికారులు గుర్తించారు. దీనికి తోడు సిటీలో కట్టెల పొయ్యిల వాడకంతో గాలి నాణ్యత మరింత క్షీణించింది. శ్వాసకోశ సమస్యలు వచ్చే ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
BHPL: ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తు గడువు పెంచాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రొంటాల సదానందం డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబాలకు చెందిన SC, ఎస్టీల సర్టిఫికెట్లు MRO ఆఫీసులో రాలేక ఇంకా చాలా మంది ఎస్సీలు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు. కావున ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తు గడువును వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు.
VKB: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. నిన్న మారేపల్లితండా సమీపంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
WGL: నెక్కొండ మండలంలోని 2019లో దేవాదాయ భూమిగా కేటాయించిన ప్రాంతంలో 2020లో చర్చి నిర్మాణం జరిగిందని రాష్ట్ర హిందూ పరిషత్ కన్వీనర్ నంద్యాల విజయరెడ్డి ఆరోపించారు. మండల తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసిన స్పందించలేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకుని భూములను రక్షించాలని కోరారు.
NRML: ప్రజల న్యాయ సమస్యలకు త్వరిత పరిష్కారం కోసం ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, సివిల్ వివాదాలు వంటి అంశాలు తక్కువ ఖర్చుతో త్వరగా పరిష్కారం పొందవచ్చని తెలిపారు. రాజీ మార్గమే రాజ మార్గం అంటూ కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
నల్గొండ: శ్రీరామనవమి వేడుకల సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఆలయాలకు విద్యుత్ అలంకరణలు చేయాలని, భక్తులకు మంచినీరు, టెంట్లు, పారిశుద్ధ్య వసతులు కల్పించాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాదినేని శ్రీనివాసరావు, బంటు సైదులు, రేపాల పురుషోత్తం రెడ్డి ఉన్నారు.
SRPT: SFI ‘చలో అసెంబ్లీ’ పిలుపు నేపథ్యంలో మేళ్లచెరువు మండల కార్యదర్శి మేడిపల్లి అశోక్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం దుర్మార్గమని నాయకులు విమర్శించారు. విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తుంటే, అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని మండిపడ్డారు.
NZB: రాష్ట్ర బడ్జెట్లో బంజారాలకు నిధులు కేటాయించలేదని బంజారా నాయకులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ AIBSS నియోజకవర్గం నాయకులు దుప్ సింగ్ నాయక్, సంతోష్, బంతిలాల్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్‌ను బోధన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బంజారాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
HNK: ఆత్మకూరు మండలానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ వంగల రాజేంద్రప్రసాద్ ఉత్తమసేవా అవార్డు అందుకున్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. కలెక్టర్ చాహత్ బాజ్ పేయ్, DMHO డా. అల్లం అప్పయ్య ఆయనకు ఈ అవార్డు అందించారు.
PDPL: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 8 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు జేఏసీ ఉమ్మడి జిల్లా ఛైర్మన్ తూళ్ల నాగరాజు ప్రకటించారు. మంగళవారం పెద్దపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, కనీస వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7న ‘చలో వరంగల్’ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.