MHBD: రాష్ట్రం ప్రభుత్వం తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు 48 గంటల రాత్రి, పగలు నిరసన దీక్ష చేస్తున్న క్రమంలో ఓ ఏఎన్ఎం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏఎన్ఎంకు షుగర్ లెవెల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లు అక్కడ ఉన్న ఎన్ఎంలు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని బ్రాహ్మణ బస్తీలో కార్పొరేటర్ డాక్టర్. సామల హేమ అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికంగా డ్రైనేజీ ఓవర్ ఫ్లో సమస్య ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మరోసారి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
HYD: HYD మెట్రోలో గత ఏడేళ్లలో 63 కోట్ల మంది ప్రయాణించినట్లు మెట్రో సంస్థ తెలిపింది. అంతేకాక 44.2 మిలియన్ల కిలోమీటర్ల మేర రైలు తిరిగింది. బ్రేకింగ్ వ్యవస్థ ద్వారా 220 మిలియన్ యూనిట్లను విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని పేర్కొంది. ఒక్కో రోజులో అత్యధికంగా 5.3 లక్షల మంది 2024 ఆగస్టు 14న ప్రయాణించినట్లుగా తెలిపారు.
KNR: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ సొసైటీ ఏర్పాటు చేసిన 37వ పుస్తక ప్రదర్శనను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 1985లో సిటీ సెంట్రల్ లైబ్రరీలో చిన్నగా ప్రారంభించిన బుక్ ఫెయిర్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చేపట్టడం, అందులోనూ ఎంతోమంది మేధావులు పాల్గొని వచ్చే తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.
HYD: పుస్తకాలను చదవే అలవాటు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిల్లలు, పెద్దలు, విద్యార్ధులకు సూచించారు. ప్రస్తుత కాలంలో ఏ సమాచారం కావాలన్నా గూగుల్ పైనే ఆధారపడుతున్నారన్నారు. ప్రఖ్యాత రయితల పుస్తకాలను కూడా చదివితే విలువైన, ప్రామాణికమైన సమాచారం లభిస్తుందన్నారు. హైదరాబాద్‌లో 37వ పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
NLG: తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 10వ రోజు జిల్లా నల్గొండ కలెక్టర్ కార్యాలయం SSA ఉద్యోగులు సమ్మె కొనసాగింది. గురువారం రోజు ఓ చిన్నారి అమ్మకి తోడుగా సమ్మెలో కూర్చొంది. ‘సీఎం గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలి’ అని ఉన్న ప్లకార్డులు చేత పట్టి మద్దతు పలికింది. ఈ సమ్మెలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
BHNG: రాష్ట్ర రైతు సంక్షేమ కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డిని గురువారం భువనగిరి జిల్లా కాంగ్రెస్ సేవాదల్ సీనియర్ నాయకులు బుర్రి బాలచందర్ గౌడ్ HYDలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతతో పాటు రైతు రుణ మాఫీ వంటి కార్యక్రమాలు బాగున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
NLG: కేతేపల్లి మండలానికి సంబంధించి 33kv విద్యుత్ లైన్‌కి అడ్డుగా ఉన్న చెట్లను తొలగించే కారణంగా కేతపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గుడివాడ కొత్తపేట కాసనగోడు కొర్లపాడు ఇనుపాముల చీకటిగూడెం, చెరుకుపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని తుంగతుర్తి బండిపాలెం గ్రామాలకు శుక్రవారం ఉ.9 గంటల నుంచి మ.1గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ప్రజలు సహకరించాలని AE శ్రీకాంత్ కోరారు.
గ్రేటర్ వరంగల్ పరిధి 17వ డివిజన్ ఆదర్శనగర్లో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పలువురు అధికారులతో కలిసి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే గురువారం పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరును కమిషనర్ కాసేపు పరిశీలించి సర్వే అధికారులకు పలు సూచనలు, సలహాలను చేశారు. కార్యక్రమంలో పలువురు సిబ్బంది ఉన్నారు.
NGKL: జిల్లా కేంద్రంలోని రామాలయం కాలనీలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 50 మంది ఎస్సైలు, సీఐలు పాల్గొన్నారు.
NGKL: జిల్లా కేంద్రంలోని రామాలయం కాలనీలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 50 మంది ఎస్సైలు, సీఐలు పాల్గొన్నారు.
MHBD: గూడూరు మండలంలోని పాకాల వాగులో మొసలి ప్రత్యక్షమైంది. గురువారం యాసంగి సాగు చేసుకోవడానికి వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులకు వాగులో పెద్ద బండపై సేద తీరుతున్న మొసలి కంటపడింది. ఇది చూసిన రైతులు భయపడ్డారు. పాకాల సరస్సు నుంచి ఆ మొసలి రావొచ్చని భావిస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.
KMR: ఎల్లారెడ్డి మండలం జానకంపల్లి కుర్దు గ్రామంలో గురువారం అటవీశాఖ అధికారులు తనిఖీ చేపట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లారెడ్డి సెక్షన్ అధికారి శ్రీనివాస్ నాయక్ సిబ్బందితో నమ్మదగిన సమాచారం మేరకు ముఫ్టీ లో వెళ్లి రైతు గొల్ల నారాయణ పొలం వద్ద భద్రపరిచిన టేకు దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ నరసాపూర్ శివారులోని కొండపోచమ్మ ఆలయం వద్ద శుక్రవారం బహిరంగ వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు. ప్రతి ఏటా ఆలయం వద్ద వేలం పాటలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయం వద్ద 11 రకాలకు సంబంధించిన వాటికి వేలం పాట వేయనున్నామన్నారు. వేలం పాటల్లో డిపాజిట్ చెల్లించి పాల్గొనాలని ఈవో సూచించారు.