• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రజావాణిలో సమస్యలపై అర్జీలు

MDCL: అల్వాల్ సర్కిల్ ప్రజావాణిలో బీజేపీ నాయకులు పలు సమస్యలపై అర్జీలు సమర్పించారు. రోడ్లపై చిన్నచితకా వ్యాపారాల వల్ల బాటసారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని డీసీ భోగేశ్వర్‌కు ఫిర్యాదు చేశారు. వెంకటాపురం కొత్తబస్తీ అంబేద్కర్ భవన్‌ను నామమాత్రపు రుసుముతో అందుబాటులో ఉంచాలని, భవనంలో విద్యుత్, నీటి సమస్యలు, బోర్‌వెల్‌ను మరమ్మతు చేయాలని బస్తీవాసులు కోరారు.

February 23, 2026 / 05:41 PM IST

క్రీడల్లో సూర్యాపేట పోలీసుల సత్తా

SRPT: రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ చాటారు. పరుగులో ఆర్‌ఎస్సై మహేష్, జావెలిన్ త్రోలో స్వామి బంగారు పతకాలు సాధించగా, పలువురు మహిళా కానిస్టేబుళ్లు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. సోమవారం విజేతలను ఎస్పీ కె.నరసింహ అభినందించారు. క్రీడల్లో రాణిస్తే పదోన్నతుల్లో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

February 23, 2026 / 05:40 PM IST

పదో వార్డ్ సమస్యపై స్పందించిన ఛైర్మన్

WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వార్డు వివేకానంద కాలనీలోని కాల్వలో మట్టి కూడుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మున్సిపల్ అధికారులకు తెలుపగా, స్పందించలేదని వారు ఆరోపించారు. ఈ విషయంపై ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ స్పందించి JBC సహాయంతో కాలువ మరమ్మతు పనులు చేయించినట్లు కౌన్సిలర్ తెలిపారు.

February 23, 2026 / 05:39 PM IST

నర్వలో విద్యా కాంప్లెక్స్ సమావేశం

NRPT: నర్వ మండల కేంద్రంలో సోమవారం విద్యా కాంప్లెక్స్ సమావేశం జరిగింది. విద్యార్థుల అభ్యాస పురోగతి, హాజరు శాతం, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎంఈవో రాంరెడ్డి ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రాథమిక విద్యా నాణ్యత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

February 23, 2026 / 05:39 PM IST

జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ పరీక్షల నియంత్రణాధికారి షెడ్యూల్ ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 16, 2026 వరకు SSC పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

February 23, 2026 / 05:38 PM IST

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్

జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని సర్పంచ్ ఎడ్ల వెంకటయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై చర్చించారు. మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి అంగన్వాడి కేంద్రంలో పిల్లలతో కలిసి ముచ్చటించారు.

February 23, 2026 / 05:38 PM IST

రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: డిప్యూటీ సీఎం

VKB: దేశ సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం వికారాబాద్ అనంతగిరిలో తెలుగు ఉభయ రాష్ట్రాల DCC అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. రోహిత్ వేముల ఘటనలో రాహుల్ స్పందించిన తీరు ఆయన సామాజిక స్పృహకు నిదర్శనమని చెప్పారు.

February 23, 2026 / 05:37 PM IST

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

BDK: మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో పబ్లిక్ పరీక్షల నిర్వహణకు నియమించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

February 23, 2026 / 05:37 PM IST

రాజాపేటలో యూరియా కోసం రైతుల‌ నిరసన

BHNG: రైతులకు యూరియా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్ మాట్లాడుతూ.. యాప్‌లో యూరియా బుక్ చేసుకుందామనుకుని ఓపెన్ చేసే క్రమంలో సెకండ్లలో యూరియా ఖాళీ అయిపోతుందన్నారు. దీంతో రైతులకు యూరియా లభించడం లేదన్నారు.

February 23, 2026 / 05:34 PM IST

లైసెన్స్‌డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్లు అందజేత

NZB: విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 46 మంది లైసెన్స్ సర్వేయర్లకు NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం కలెక్టరేట్‌లో సర్టిఫికెట్లను అందజేశారు. కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు. లైసెన్స్డ్ సర్వేయర్లు బాధ్య తాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావు లేకుండా నిజాయతీగా సర్వే నివేదికలు అందజేశాయన్నారు.

February 23, 2026 / 05:34 PM IST

ఈత చెట్ల నరికివేతపై ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు

NLG: దేవరకొండ మండలం తాటికోల్ లో వెంచర్ డెవలప్మెంట్ పేరుతో ఈత చెట్లు నరికివేశారని బీసీ సంఘం, గౌడ సంఘం నాయకులు ఎక్సైజ్ అధికారికి సోమవారం పిర్యాదు చేశారు. గౌడ సంఘాల జేఏసీ జిల్లా ఛైర్మన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గౌడ కులస్తులు ఉపాధి కోల్పోతారని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

February 23, 2026 / 05:33 PM IST

AI సాంకేతికతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో అధికారులకు క్లాడ్ (Claude) AI సాంకేతికతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పరిపాలనలో వేగం, ఖచ్చితత్వం పెంచేందుకు ఎక్సెల్, నివేదికల తయారీలో ఈ AI సాధనాలను ఉపయోగించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాల పర్యవేక్షణలో AI టూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.

February 23, 2026 / 05:33 PM IST

అక్రమ నిర్మాణాలు తొలగించాలని ప్రజావాణిలో ఫిర్యాదు

పెద్దపల్లి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పుష్పలత అనే మహిళ స్థానిక శాంతినగర్ కాలనీ వీధి రోడ్డుపై చేపడుతున్న అక్రమ కట్టడాలను తొలగించాలని కలెక్టర్‌కు ఆర్జీ సమర్పించారు. ఇది వరకు ఫిర్యాదులు ఉన్నప్పటికీ చాటు మార్గంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మునిసిపల్ కమిషనర్‌కు లేఖ రాస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.

February 23, 2026 / 05:29 PM IST

ఉమామహేశ్వర క్షేత్రానికి రూ.25,116 విరాళం అందజేత

NGKL: బొల్లారం గ్రామానికి చెందిన అమర్ సింగ్ దంపతులు ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి రూ. 25,116 విరాళం అందజేశారు. కీర్తిశేషులు నేనావత్ భావన జ్ఞాపకార్థం ఆలయ అభివృద్ధి, నిత్య అన్నదానం కోసం ఈ మొత్తాన్ని ఛైర్మన్ మాధవరెడ్డికి సోమవారం సమర్పించారు. అనంతరం దంపతులకు ఆలయ కమిటీ సన్మానం చేసి ప్రత్యేక పూజలు చేశారు.

February 23, 2026 / 05:29 PM IST

ఆశ కార్యకర్తల ముందస్తు అరెస్ట్

KNR: హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, రామడుగు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. నెలల తరబడి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

February 23, 2026 / 05:28 PM IST