మహబూబ్‌నగర్‌లోని ఒక కళాశాలలో PPT, UTF సంస్థల సహకారంతో 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ విద్య అందించడం ఎంతో గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులకు హైదరాబాద్‌లోని ట్రస్ట్ పాఠశాలలో ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు.