• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘RSS కోసం తన జీవితాన్ని ధారపోశాడు’

SRCL: దీన్ దయాల్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామని BJP జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులులర్పించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. ఆయన జీవితం వారసత్వాన్ని గుర్తు చేసుకోవడానికి అంత్యోదయ జరుపుకుంటామని వివరించారు. RSS కోసం తన జీవితాన్ని ధారపోసాడని కొనియాడారు.

September 25, 2025 / 02:32 PM IST

ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టిన బడా వ్యాపారి

వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమిని కబ్జాపెట్టి నిర్మాణాలు చేపట్టిన యజమానికి నోటీసులు జారీ చేయాలని రెవెన్యూ అధికారులు నిశ్చయించారు. ప్రభుత్వ స్థలంలో బడ వ్యాపారి ఒకరు నిర్మాణాలు చేపట్టినట్టుగా అందిన ఫిర్యాదుల మేరకు తహసీల్దార్ ఇక్బాల్ సిబ్బందితో కలిసి గురువారం తనిఖీ చేశారు. వెంటనే పనులు ఆపించాలని కూలీలను తాహసీల్దార్ ఆదేశించారు.

September 25, 2025 / 02:31 PM IST

‘తీజ్ పండుగ లంబాడీ సంస్కృతికి ప్రతీక’

BHPL: భూపాలపల్లి మండలం కమలాపూర్, గొల్లబుద్దారం, దూదేకులపల్లి గ్రామాల్లో గురువారం జరిగిన తీజ్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. తీజ్ పండుగ లంబాడీ సంస్కృతికి ప్రతీక అని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లంబాడీల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.

September 25, 2025 / 02:30 PM IST

కాంగ్రెస్ నూతన అధ్యక్షుల నియామకం

KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుల నియామకం చేపడుతున్నట్లు మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ తెలిపారు. గురువారం అచ్చయపల్లి, చిన్న ఆత్మకూర్, మసానిపల్లి, కన్నారెడ్డి దండు, చీనూరు, గోలి లింగాల, నాగిరెడ్డిపేట, అక్కంపల్లి గ్రామాలకు నూతన అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

September 25, 2025 / 02:30 PM IST

‘ఆలూరులో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ’

GDWL: గట్టు మండలం ఆలూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అధికారులు ఈ సమస్యలను పట్టించుకోవడం లేదని నడిగడ్డ హక్కుల పోరాట సమితి గ్రామ నాయకుడు జమ్మన్నఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో వీధి దీపాలు లేకపోవడంతో చీకటిగా ఉందని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు పేర్కొన్నారు.

September 25, 2025 / 02:27 PM IST

‘విద్యుత్ షాక్‌తో మేకల కాపరి మృతి’

VKB: జిల్లాలో విషాధ ఘటన జరిగింది, వికారాబాద్ మండలం రాళ్ల చిట్టెంపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌తో మేకల కాపరి రాము మృతి చెందాడు. అడవి పందులు రాకుండా రైతు పొలం చుట్టూ బిగించిన విద్యుత్ వైర్‌కు తగిలి గురువారం ఉదయం విద్యుత్ షాక్‌కి గురయ్యాడు. అలాగే రాముతో పాటు ఒక మేక కూడా షాక్‌తో చనిపోయింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

September 25, 2025 / 02:26 PM IST

“స్వచ్ఛతా హి సేవ” కార్యక్రమంలో శ్రమదానం

ADB: భోరాజ్ మండలంలోని బాలాపూర్ గ్రామంలో “స్వచ్ఛతా హి సేవ” కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రమదానం నిర్వహించారు. గ్రామంలోని పాఠశాల ఎదుట గ్రామ యువకులు, గ్రామస్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ. కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పంచాయతీ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.

September 25, 2025 / 02:25 PM IST

మంత్రిని కలిసిన ఎమ్మెల్యే యశస్విని

JN: పాలకుర్తి రైతుల పంటల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పాలకుర్తి నియోజకవర్గంలో చెక్‌డ్యామ్‌లు నిండకపోవడం వలన సాగునీటి కొరత ఏర్పడి పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు.

September 25, 2025 / 02:24 PM IST

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

WNP: పీఎం ఆవాజ్ యోజన సర్వే చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. పాన్ గల్, బుసిరెడ్డిపల్లిలలో ఇవాళ ఆయన ఆకస్మికంగా పర్యటించారు. పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సర్వే తీరును ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న కుటుంబ వివరాలను సేకరించాలని అధికీరులను ఆదేశించారు.

September 25, 2025 / 02:21 PM IST

పర్యావరణ ప్రేమికుడుగా FDO రామ్మోహన్

MNCL: పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణలో జన్నారం మండల అటవీశాఖ ఎఫ్‌డీవో రామ్మోహన్ రావు కీలకపాత్ర పోషిస్తున్నారు. అటవీశాఖ అధికారిగా విధులను నిర్వహిస్తూనే, ప్రింట్, ప్రచార సాధనాలలో తన వ్యాసాలతో ఆయన పర్యావరణ ప్రేమికుడిగా గుర్తింపు పొందారు. ప్రముఖ దినపత్రికలు, మ్యాగ్జైన్లలో 80కుపైగా పర్యావరణ వ్యాసాలను రాశారు. పలు టెలివిజాలలో 25కు పైగా ఇంటర్వ్యూలు ప్రసారం అయ్యాయి.

September 25, 2025 / 02:21 PM IST

‘బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రచారం’

WGL: వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్‌ జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చి తమది సామన్యుడి, మధ్యతరగతి ప్రభుత్వమని చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. కొత్త జీఎస్టీ విధానంతో బీహార్ ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఉద్దేశంతోనే వీటిని పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తురన్నారు.

September 25, 2025 / 02:21 PM IST

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

NZB: మారుతీ నగర్ స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏకాత్మతా మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు.

September 25, 2025 / 02:21 PM IST

‘ఇచ్చిన హామీలను అమలు చేయాలి’

SRPT: జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లను గురువారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ధర్నాకు బయలుదేరిన తమను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

September 25, 2025 / 02:19 PM IST

రామాలయం నిర్మాణానికి రూ.5 లక్షలు విరాళం

KMM: కూసుపంచి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఆ మొత్తాన్ని ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులకు మంత్రి అందజేశారు. రామాలయం నిర్మాణానికి విరాళం అందజేసిన మంత్రి పొంగులేటికి నేతలు, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

September 25, 2025 / 02:12 PM IST

గ్రూపు-1 ఉద్యోగం సాధించిన జిల్లా యువకుడు

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన బొక్క సుధీర్ టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1లో 437.5 మార్కులతో ఎంపీడీవోగా ఎంపికయ్యాడు. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుధీర్, తన భార్య జ్యోతిర్మయి సహకారంతో ఇంటి వద్దే కష్టపడి చదివి మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని సాధించాడు. గ్రూప్-1 సాధించిన సుధీర్‌ను గ్రామస్థులు అభినందించారు.

September 25, 2025 / 02:11 PM IST