• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ప్రతి రోజు నామినేషన్ రిపోర్టులు పంపించాలి’

ADB: నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ప్రతి రోజు త్వరగా రిపోర్టును పంపించాలని కలెక్టర్ రాజర్షి షా బుధవారం అధికారులకు సూచించారు. సంబంధిత వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అప్‌లోడ్ చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ చివరి సమయంలో, విత్ డ్రా సమయాల్లో వీడియో చిత్రీకరణ చేయిస్తే అవి తగిన ఆధారాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

October 8, 2025 / 07:03 PM IST

‘పత్తి మద్దతు ధర పొందాలంటే ఈ యాప్ తప్పనిసరి’

SRD: పత్తి రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందాలంటే మొబైల్‌లో కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఖేడ్ ADA నూతన్ కుమార్ బుధవారం తెలిపారు. ప్రతి రైతు ఈ యాప్‌లో రైతు వివరాలు, ఏయే పంటలు వేశారో నమోదు చేయాలన్నారు. పత్తి అమ్మే సమయంలో ఈ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే, ప్రభుత్వ మద్దతు ధర వర్తిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

October 8, 2025 / 07:01 PM IST

‘రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలి’

SRCL: రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలని, రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో బుధవారం రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. రైతులు డిజిటల్ వ్యవసాయం మట్టి పరీక్షలు నీటి నిర్వహణ పంటల వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు పాటించాలన్నారు.

October 8, 2025 / 07:01 PM IST

‘అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి’

MNCL: తాండూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ జోష్ణ, రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. ‘భూ భారతి’ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్నవాటిని త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.

October 8, 2025 / 07:01 PM IST

మహాప్రస్థానంలో వాటర్ జల్లు వ్యవస్థ పనుల ప్రారంభం

SRD: పటాన్‌చెరు మహాప్రస్థానంలో అచ్చమ్మ జ్ఞాపకార్థంగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మోటార్ వాటర్ ట్యాంక్, జల్లు వ్యవస్థ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ప్రస్తుత కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రుద్రభూమి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కూన అప్పారావు తదితరులు ఉన్నారు.

October 8, 2025 / 07:00 PM IST

‘స్కిల్ కాంపిటీషన్‌కు దరఖాస్తు చేసుకోండి’

NLG: ప్రపంచ స్కిల్ కాంపిటీషన్‌లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి యువత ఈ నెల15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ ఇవాళ తెలిపారు. 6- 24 ఏళ్ల వయస్సు వారు,నైపుణ్యం కలిగి నిరక్షరాస్యులైన వారు కూడా అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు http://www.skillindiadigital.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

October 8, 2025 / 06:59 PM IST

సింగూర్ జలాశయంలో పెరుగుతున్న వరద

SRD: పుల్కల్ మండలం సింగూర్ జలాశయంలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు 30,410 క్యూసెక్కుల వరద వచ్చి చేరినట్లు AEE స్టాలిన్ తెలిపారు. గత మూడు రోజుల నుంచి వరద ప్రవాహం పెరుగుతుండడం వల్ల 4 గేట్లు ఎత్తి దిగువకు 35,750 క్యూసెక్కులు వరదను వదిలి పెట్టినట్లు చెప్పారు. ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 17.791 టీఎంసీలు ఉందని పేర్కొన్నారు.

October 8, 2025 / 06:58 PM IST

నూతన సాంకేతికతను అలవర్చుకోవాలి: MEO

SRPT: ఉపాధ్యాయులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని ఎంఈవో సైదా నాయక్ సూచించారు. ఇవాళ హుజూర్‌నగర్ డివిజన్‌లోని అన్ని మండలాల ఉన్నత పాఠశాలల గణితం, సైన్స్ ఉపాధ్యాయులకు నిర్వహించిన డిజిటల్ లెర్నింగ్ శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తప్పనిసరిగా తరగతి గదుల్లో అమలు చేయాలని ఆయన కోరారు.

October 8, 2025 / 06:56 PM IST

అదుపుతప్పిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో బుధవారం ఆర్సీ తాండాకు చెందిన శంకర్ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా, అకస్మాత్తుగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపుతప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికెన్ సెంటర్ల వ్యర్థాల వల్ల రోడ్లపై కుక్కలు, పందుల సంచారం పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

October 8, 2025 / 06:56 PM IST

బొటానికల్ గార్డెన్‌లో ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలు

HYDలో ఇవాళ బోటానికల్ గార్డెన్‌లో ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్ధుల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశ్యంతో పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

October 8, 2025 / 06:55 PM IST

పిడుగుపాటుకు బాలుడి మృతి

HYD: ఇబ్రహీంపట్నం పరిధి యాచారంలోని నల్లవెళ్లిలో పిడుగు పాటుకు జోగు మనీష్ మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా.. 7వ తరగతి చదువుతున్న బాలుడు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. పిడుగు పాటుకు బాలుడు అక్కడక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న యాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

October 8, 2025 / 06:55 PM IST

సమిష్టి కృషితోనే గెలుపు ఖాయం: ఎంపీ

ADB: సమిష్టి కృషితోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని జిల్లా ఎంపీ నగేశ్ అన్నారు. బోథ్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులతో బుధవారం సమావేశమై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

October 8, 2025 / 06:54 PM IST

కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మండల అధ్యక్షుడు

KMR: డోంగ్లి మండల బీజేపీ అధ్యక్షుడు ధనుంజయ్ పటేల్‌తో పాటు పలువురు కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు వారికి పార్టీ కండువాలు వేశారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై కాంగ్రెస్‌లో చేరామని ధనుంజయ్ పటేల్ వివరించారు.

October 8, 2025 / 06:50 PM IST

ఎస్పీ రోహిత్ రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏఎస్సై

BDK: టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న G. భాస్కర్‌కి ASI ప్రమోషన్ వచ్చింది. ఈ సందర్భంగా బుధవారం ఎస్పీ రోహిత్ రాజుని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో నిబద్ధతతో పనిచేసే మరిన్ని మంచి పదవులు అవరోదించాలని ఎస్పి రోహిత్ రాజు ఏఎస్సై భాస్కర్‌కు తెలిపారు.

October 8, 2025 / 06:49 PM IST

బలపాలలో BRS లోకి చేరికలు

MHBD: కార్యకర్తలకు BRS పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే BRS పార్టీ అని డోర్నకల్ మాజీ MLA డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. కురవి మండలంలోని బలపాల గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నుండి BRS పార్టీలోకి చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి రెడ్యానాయక్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.

October 8, 2025 / 06:49 PM IST