• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మిర్యాలగూడ బస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మంత్రి

NLG: మిర్యాలగూడ ఆర్టీసీ బస్ స్టేషన్‌ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కలిసి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌కు మరమ్మతు పనులు చేయాలని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అదేశించారు. బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

September 28, 2025 / 03:30 PM IST

‘కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు మేలు చేకూరుతుంది’

ADB: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు మేలు చేకూరుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. ఆదివారం బోథ్ మండలంలో పర్యటించి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో మాట్లాడారు. పేదింటి కుటుంబానికి సొంత ఇంటి కలను సహకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. దశల వారీగా అర్హులందరికీ ఇళ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

September 28, 2025 / 03:28 PM IST

బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు అని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. ఆదివారం కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా నుంచి పోలంపల్లి వరకు రూ.70 లక్షల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

September 28, 2025 / 03:22 PM IST

‘దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై సంపూర్ణంగా ఉండాలి’

MBNR: దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై సంపూర్ణంగా ఉండాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి ఆహ్వానం మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు రోడ్డులో ఉన్న దుర్గామాత మండపాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు సుఖసంతోషాలతో దసరా పండుగలు జరుపుకోవాలన్నారు.

September 28, 2025 / 03:18 PM IST

తిరుపతి దేవస్థానం అడ్వైజర్ కమిటీ ఛైర్మన్‌గా శంకర్ గౌడ్

HYD: హిమాయత్ నగర్ తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వయిజరి కమిటీ ఛైర్మన్ బాధ్యతలకు రాష్ట్ర జనసేన పార్టీ ఇంఛార్జి శంకర్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నేతలు పాల్గొన్నారు.

September 28, 2025 / 03:15 PM IST

‘ప్రజలు భక్తి మార్గంలో నడవాలి’

NRML: ఆధ్యాత్మిక మార్గం అన్నింటికంటే ఉత్తమమైనదని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఆదివారం ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్‌లో ఏర్పాటుచేసిన దుర్గామాత అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు భక్తి మార్గంలో నడవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యం, మాజీ వైస్ ఛైర్మన్ కావలి సంతోష్ ఉన్నారు.

September 28, 2025 / 03:12 PM IST

‘భగత్ సింగ్ ఆశయ సాధనకు కృషి చేయాలి’

NRML: యువత భగత్ సింగ్ ఆశయాలను సాధించాలని సీపీఎం నిర్మల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.సురేష్ కోరారు. భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం దస్తురాబాద్ మండలంలోని బుట్టాపూర్ గ్రామంలో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ, అనుబంధ సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

September 28, 2025 / 03:12 PM IST

శరన్నవరాత్రి వేడుకలకు హాజరైన మాజీ మున్సిపల్ ఛైర్మన్

మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని సగర కాలనీలో ఆదివారం నిర్వహించిన శరన్నవరాత్రి వేడుకలకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలపై ఉండాలని కాంక్షించారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో దసరా పండగలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

September 28, 2025 / 03:12 PM IST

అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవ వేడుకలు

BDK: అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవ వేడుకలు I DOC కలెక్టరేట్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనిన కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సంకేత భాష పోస్టర్‌ను ఆవిష్కరించారు.

September 28, 2025 / 03:10 PM IST

‘రేపే సద్దుల బతుకమ్మను జరుపుకోవాలి’

KNR: SEP 21న ఆదివారం అమావాస్య రోజు చిన్న బతుకమ్మను జరుపుకున్నామని, దాని ప్రకారం SEP 29కి తొమ్మిది రోజులు పూర్తవుతాయని KNRకు చెందిన నమలికొండ రమణాచార్యులు తెలిపారు. రేపే సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని స్పష్టంచేశారు. సద్దుల బతుకమ్మను సోమవారమా లేక మంగళవారం జరుపుకోవాలా అనే సందేహాలు వద్దని పేర్కొన్నారు. అందరూ పండితులం కలిసి తీసుకున్న నిర్ణయం అని తెలిపారు.

September 28, 2025 / 03:10 PM IST

జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు: సీపీ

KMR: జిల్లా ప్రజలకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఒక వీడియో సందేశంలో పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఈ విజయదశమి జిల్లా ప్రజలకు విజయాలను చేకూర్చాలని కోరుకున్నారు.

September 28, 2025 / 03:06 PM IST

చీర్లవంచలో దుర్గాదేవి కుంకుమార్చన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో ఆదివారం దుర్గాదేవి మండపం వద్ద కుంకుమార్చన పూజలు, అన్న ప్రసాదం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టి అమ్మవారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

September 28, 2025 / 03:03 PM IST

BJP ప్రజాస్వామ్య పార్టీ కాదు-CPM(ML)

ASF: BJP ప్రజాస్వామ్య పార్టీ కాదని RSS పార్టీ అని CPM (ML)రెడ్ స్టార్ పాలిట్ బ్యూరో సభ్యుడు మానసయ్య అన్నారు. ఆసిఫాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. మతపరమైన ఫాసిస్టు ఎజెండా ఆధారంగా హిందూ రాష్ట్రాన్ని స్థాపించడానికి దేశవ్యాప్తంగా ఉన్మాద ప్రచారాన్ని BJP, RSS నిర్వహిస్తుందని ఆరోపించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.

September 28, 2025 / 02:56 PM IST

సంగారెడ్డిలో ‘భగత్ సింగ్ జయంతి’

SRD: సంగారెడ్డి పట్టణంలో భగత్ సింగ్ జయంతి ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, ఉపాధ్యక్షుడు మహేష్ కుమార్, కార్యదర్శి సబ్జ్జత్ ఖాన్, సహ కార్యదర్శలు పాండురంగం పాల్గొన్నారు. ఈ సమావేశంలో తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.

September 28, 2025 / 02:54 PM IST

బతుకమ్మ, దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

MHBD: తొర్రూరులో బతుకమ్మ, రావణ దహన కార్యక్రమాల ఏర్పాట్లను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదివారం పరిశీలించారు. భద్రత, లైటింగ్, తాగునీరు, పార్కింగ్, వేదిక, శానిటేషన్ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. యతీరాజారావ్ పార్కులో జరగనున్న రావణ దహనానికి కూడా సమగ్ర ఏర్పాట్లు చేయాలన్నారు.

September 28, 2025 / 02:48 PM IST