• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో మొదలైన స్థానిక ఎన్నికల సందడి

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల‌పై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. MPTC, ZPTC, ZP ఛైర్మన్ పదవుల‌పై వివిధ పార్టీల అగ్ర నాయకులు దృష్టి సారించారు. కాగా ఉమ్మడి జిల్లాలో 778 ఎంపీటీసీ, 75 ZPTC స్థానాలు ఉన్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

September 25, 2025 / 10:05 AM IST

సినీ హస్యనటుడు వేణుమాధవ్ మరణించి నేటికీ 5 సంవత్సరాలు

SRPT: సినీ హస్యనటుడు వేణుమాధవ్ మరణించి నేటికీ ఐదేళ్లు పూర్తవుతుంది. తనదైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ గ్రేట్ కమెడియన్ ది కోదాడ నే. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమకు పరిచయమైన వేణుమాధవ్.. అతి తక్కువ కాలంలోనే 300కు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

September 25, 2025 / 10:05 AM IST

పుష్కర ఘాట్‌లో భారీగా పెరుగుతున్న వరద ప్రవాహం

BHPL: కాళేశ్వరంలోని పుష్కర ఘాట్‌లో బుధవారం గోదావరి నది వరద భారీగా పెరుగుతోంది. గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉభయ నదులు పొంగి, కాళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం 7.09 లక్షల క్యూసెక్కుల నీరు 9.81 మీటర్ల ఎత్తున పారుతూ లక్ష్మీ బ్యారేజీ వైపు వెళ్తుంది. బ్యారేజీలో 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

September 25, 2025 / 10:02 AM IST

యాదాద్రి ఇన్‌ఛార్జి ఈవోగా రవి నాయక్

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో వెంకట్రావు తన వ్యక్తిగత అవసరాల రీత్యా నెలరోజుల పాటు సెలవులో వెళ్లారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జి ఈవోగా రవినాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ పనిచేసిన అనుభవం ఉండటంతో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.

September 25, 2025 / 10:01 AM IST

క్రీడా కళతో ఉట్టిపడుతున్న PJR వంతెన..!

HYDలో PJR వంతెన క్రీడాకారులతో ఉట్టిపడుతుంది. వంతెన ప్రతి పిల్లర్‌పై ఆర్ట్ ఎలివేషన్, సైడ్ గ్లిప్పింగ్ కళలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అంతర్జాతీయ పేరు గురించిన మహానగరంలో వంతెనలు, అండర్ పాస్ నిర్మాణాలకు నూతన కళ సంతరించుకుంటున్న వేళ, పలువురు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు వంతెనల సుందరీకరణతో కళాకారులకు ఉపాధి కలుగుతుంది.

September 25, 2025 / 10:00 AM IST

‘లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ AO’

VKB: జిల్లాలోని మోమిన్ పేట్ మండల వ్యవసాయ శాఖ అధికారి (ఏఓ) భూపతి జయశంకర్ ఫర్టిలైజర్ షాప్ అనుమతుల కోసం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక ఫర్టిలైజర్ షాప్ లైసెన్స్ కోసం జయశంకర్ లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశారు. వికారాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు.

September 25, 2025 / 09:57 AM IST

రేపు ప్రభుత్వ కళాశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్

SRD: కంగ్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్ గురువారం తెలిపారు. ఇంటర్ బోర్డు ఆదేశం మేరకు శుక్రవారం ఉదయం 10:30 లకు పేరెంట్స్ హాజరు కావాలన్నారు. ల్యాబ్ మెటీరియల్, పోటీ పరీక్షలు, NEET, EAMCET తదితర ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. అయితే తల్లిదండ్రుల విలువైన సూచనల కోసం మీటింగ్ నిర్వహించామన్నారు.

September 25, 2025 / 09:53 AM IST

‘రైతుబజార్‌లో ఖాళీగా ఉన్న షాపులు అద్దెకు’

VKB: వికారాబాద్ రైతుబజార్‌లో ఖాళీగా ఉన్న షాపును మహిళా సంఘాలకు అద్దెకు ఇవ్వనున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి తెలిపారు. మూడు రోజుల్లో జిల్లా ఎస్టేట్ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని, పూర్తి సమాచారం కోసం 9063222922 నంబర్‌ను డయల్ చేయాలని సూచించారు.

September 25, 2025 / 09:48 AM IST

బ్యాంకు సభ్యులకు దసరా బోనస్ పంపిణీ

HNK: ములకనూరు బ్యాంక్ సభ్యులకు దసరా బోనస్ కింద రూ.3 కోట్ల 70 లక్షలు పంపిణీ చేయనున్నట్లు బ్యాంకు అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బోనస్‌ను సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ఆయా గ్రామాల్లోని బ్యాంకు గోదాంలో సభ్యులకు అందజేయనున్నట్లు తెలిపారు. సభ్యులు తప్పనిసరిగా తమ పాస్‌బుక్స్‌తో హాజరై బోనస్ తీసుకోవాలని సూచించారు.

September 25, 2025 / 09:45 AM IST

ఘనంగా శివ కేశవ స్వామి కళ్యాణం

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లోని శివకేశవస్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం పురోహితులు రాచర్ల విశ్వనాథశర్మ, శ్రీనివాసశర్మ, శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో శివకే శవుల ఆలయ శిఖరముపై కుంభాభిషేకం, హోమం, యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, తదితర కార్యక్రమాలను జరిపించారు.

September 25, 2025 / 09:44 AM IST

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు ‌

SRPT: జాజిరెడ్డిగూడెం మండలంలో 9 మంది లబ్ధిదారులకు గురువారం నాగారంలోని ఎమ్మార్సీ భవనంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా  చెక్కులను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్లొంటున్నట్లు తహసీల్దార్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సకాలంలో హాజరై చెక్కులు పొందాలని కోరారు.

September 25, 2025 / 09:32 AM IST

మార్కెట్ యార్డు ఏర్పాటుకు స్థల పరిశీలన

SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దె చెరువు సమీపంలో ఏర్పాటు చేయనున్న మార్కెటు యార్డు కోసం నీటి పారుదుల, తహసీల్దార్ అధికారులు, బుధవారం స్థల పరిశీలన చేశారు. మండల కేంద్రంలో వార సంత ప్రధాన రహదారిపై కొనసాగుతుండడం వల్ల ప్రజలు, చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు.

September 25, 2025 / 09:31 AM IST

ఉమ్మడి జిల్లాలో నేడు అట్ల బతుకమ్మ వేడుకలు

WGL: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం అట్ల (అత్రస) బతుకమ్మ వేడుకలను మహిళలు నిర్వహించనున్నారు. ఇంట్లో సాదాసీదాగా అందుబాటులోని పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. పూలు తక్కువైనా, ఉన్న వాటితోనే అలంకరిస్తారు, ఇది తల్లి దయ, సహనాన్ని సూచిస్తుంది. ‘అత్రస’ అంటే సాధారణం, అతి కష్టపడకుండా సరళంగా పండుగ జరుపుకోవడమని బుధవారం స్థానికులు తెలిపారు.

September 25, 2025 / 09:29 AM IST

పొంగిపొర్లుతున్న నార్కట్‌పల్లి పెద్ద చెరువు

NLG: బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్స్ రిజర్వాయర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయడంతో నార్కట్‌పల్లి పెద్ద చెరువు పూర్తిగా నిండి పొంగి పొర్లుతోంది. ఎండిపోయిన చెరువుకు తిరిగి జలకళ రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని రైతులకు పంటల సాగుకు నీరు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది.

September 25, 2025 / 09:26 AM IST

ఆసిఫాబాద్ జిల్లా వర్షపాతం వివరాలు

ASF: గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిర్పూర్(యూ)లో 7.1 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. దహేగాం 2.3, పెంచికల్పేట్ 3.3, సిర్పూర్ (టి) 3.1, చింతలమానేపల్లి 4.9, ఆసిఫాబాద్ 4.4, కాగజ్నగర్ 1.6, వాంకిడి 19.0, కెరమెరి 2.4, జైనూర్ 6.3, రెబ్బెన 2.0, తిర్యాణి 2.8, లింగాపూర్ 6.3, బెజ్జార్లో 2.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

September 25, 2025 / 09:26 AM IST