• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బీరు బాటిల్‌లో తలదూర్చిన పాము

WGL: వర్ధన్నపేట మండలం రామోజీకుమ్మరిగూడెం తండాలోని ఎస్సారెస్పీ కాలువపై ఓ పాము తాగి పడేసిన బీర బాటిల్(టిన్ బీర్)లో తలదూర్చింది. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా రాకపోవడంతో చాలాసేపు తల్లడిల్లింది. శనివారం సాయంత్రం అటుగా గీతకార్మికుడు బండారి కుమారస్వామి వెళ్తుండగా ఈ ఘటన చూసి తన ఫోన్‌లో బందించాడు. పామును బాటిల్లో నుండి తీసేందుకు ప్రయత్నించినప్పటికీ రాలేదు.

October 4, 2025 / 08:20 PM IST

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

BHNG: మోత్కూర్ మండలం దాచారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి లబ్దిదారులకు త్వరగా అందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు శాశ్వత వసతి కల్పించడమే అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

October 4, 2025 / 08:20 PM IST

పూడికతీత పనులను పరిశీలించిన ఐఏఎస్ అధికారి

KNR: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రీచ్ లు నిర్వహించాలని, టీజీఎండీసీ విసీ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి భవేశ్ మిశ్రా సూచించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఎల్ఎండి ప్రాజెక్టు పూడికతీత పనులలో భాగంగా కొత్తపల్లి ఇసుక రీచ్ పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వపరంగా అన్ని అనుమతులతో ప్రభుత్వని కిలోబడి పని చేయాలన్నారు.

October 4, 2025 / 08:18 PM IST

తడిసి ముద్దయిన వరి ధాన్యం

KNR: శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో మధ్యాహ్నం కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. కొత్తగట్టు గ్రామంలోని జాతీయ రహదారిపై ముందుగా నాట్లు వేసుకున్న కొంతమంది రైతులు ధాన్యం నూర్పిడి చేసి ఆరబెట్టుకున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా వచ్చిన వర్షంతో రైతులు ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకోవడం కోసం టార్పాలిన్ కవర్లను కుప్పలపై కప్పి ఉంచారు.

October 4, 2025 / 08:17 PM IST

రాజకీయ నాయకులకు అవగాహన కల్పించిన అధికారులు

MHBD: గూడూరు మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో శనివారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ, నియమావళిపై రాజకీయ నాయకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో MRO నాగభవాని, ఇంఛార్జీ MPDO సత్యనారాయణ, SI గిరిధర్ రెడ్డి ఉన్నారు.

October 4, 2025 / 08:14 PM IST

RRR బాధితులతో చలో హైదరాబాద్

BHNG: అక్టోబర్ 6న తలపెట్టిన హైదరాబాద్ HMDA ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని RRR బాధితులు అధిక సంఖ్యలో పాల్గొనాలని RRR బాధితుల చౌటుప్పల్ మండల కన్వీనర్ డబ్బేటి రాములు గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ని ఎత్తివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రాములు డిమాండ్ చేశారు.

October 4, 2025 / 08:11 PM IST

VKB జిల్లాలో రేపు వర్షాలు కురిసే ఛాన్స్

VKB: జిల్లా పరిధిలోని వికారాబాద్ మున్సిపాలిటీ చౌడాపూర్, తాండూరు, పరిగి పరిసర ప్రాంతాలలో రేపు చిరుజల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ ముందస్తుగా అంచనా వేసినట్లు తెలిపింది. రెండు రోజులపాటుగా వాతావరణం చల్లబడి ఉంటుందని, ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది.

October 4, 2025 / 08:04 PM IST

రామ్మూర్తి గౌడ్ మృతి బాధాకరం

SRPT: హుజూర్ నగర్ పట్టణ గౌడ సంఘం పెద్ద గౌడ సోమగాని రామ్మూర్తి గౌడ్ మృతి పట్ల, తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి నాగయ్య గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలో రామ్మూర్తి గౌడ్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.

October 4, 2025 / 08:03 PM IST

వికారాబాద్ జిల్లా రాజకీయ ముఖచిత్రం పై మీటింగ్

VKB: వికారాబాద్ జిల్లా రాజకీయ ముఖచిత్రం పై మాజీ BRS ఎమ్మెల్యేలు అందరు కలిసి స్పెషల్ మీటింగ్ నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల అంశాల పై సుదీర్ఘంగా చర్చించినట్లు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. స్థానిక సంస్థల్లో సత్తా చాటటమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు.

October 4, 2025 / 08:03 PM IST

నిరంతర సాధనే..విజయానికి మార్గం!

RR: గ్రూప్-1లో ర్యాంక్ సాధించిన వీణ తన ప్రిపరేషన్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. తండ్రి శ్రీనివాస్ TGRTC ఉద్యోగి కాగా.. కూతురు డెప్యూటీ కలెక్టర్ బాధ్యతలకు రంగారెడ్డి జిల్లాకు పోస్టింగ్ రావటం సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా నిరంతర సాధన ఒక్కటే తనను ఈ స్థాయికి నిలబెట్టిందని తెలిపారు. మన లక్ష్యం కోసం నిరంతరంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నారు.

October 4, 2025 / 08:01 PM IST

బస్సు సౌకర్యం కల్పించాలని ప్లకార్డులతో నిరసన

NLG: మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని DYFI, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఆ గ్రామంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా DYFI మాజీ రాష్ట్ర కార్యదర్శి ఐత విజయ్ మాట్లాడుతూ.. 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో గ్రామాలకు సరైనటువంటి రవాణా సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటు అన్నారు.

October 4, 2025 / 08:01 PM IST

మండలంలో రేపు మంత్రి సీతక్క పర్యటన

MHBD: గంగారం మండల కేంద్రంలో రేపు (ఆదివారం) ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించబడనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.

October 4, 2025 / 08:00 PM IST

స్థానిక సంస్థ ఎన్నికల్లో BRS సత్తా చాటాలి: మాజీ MLA

MHBD: సీరోలు మండల కేంద్రంలో శనివారం BRS నేతల ఆధ్వర్యంలో సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ MLA రెడ్యా నాయక్ హాజరై, మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న MPTC,ZPTC, సర్పంచ్ ఎన్నికల్లో BRS అభ్యర్థులు గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.

October 4, 2025 / 07:59 PM IST

ఫ్లెక్సీల తొలగింపుకు గ్రామస్తుల వినతి

NLG: రోడ్లపై ప్రమాదకరంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని కోరుతూ కొండమల్లేపల్లి మండలం కోలుముంతలపహాడ్ గ్రామస్తులు శనివారం MPDO కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఫ్లెక్సీలు, ఇతర నిర్మాణాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వినతి పత్రంలో పేర్కొన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

October 4, 2025 / 07:55 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల పై మంత్రి శ్రీధర్ బాబు కీలక మీటింగ్

HYD: రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో మంత్రి శ్రీధర్ బాబు కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై నేతలకు దిశానిర్దేశం ఇచ్చారు. పార్టీ బలం, బలహీనతలు, గత ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిపారు. సమన్వయ లోపం రాకుండా చూడాలని ఆదేశించారు.

October 4, 2025 / 07:54 PM IST