PDPL: ప్రతి గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో విత్తన ఉత్పత్తి క్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు, పాలకుర్తి మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ తెలిపారు. పాలకుర్తి మండలం కుక్కల గూడూరులోని విత్తనోత్పత్తి క్షేత్రాలను నిన్న పరిశీలించారు. అయన మాట్లాడుతూ.. విత్తనోత్పత్తి క్షేత్రాల వాటి నుంచి వచ్చే నాణ్యమైన విత్తనాలను అదే ప్రాంతంలో వినియోగిస్తామన్నారు.
KMM: ఖమ్మం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావుతో కలిసి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై రైల్వే అధికారులతో సమీక్షించారు. ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.25.41 కోట్లు కేటాయించగా.. పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు.
MBNR: జడ్చర్ల మండలం కిష్టారం పోతిరెడ్డి చెరువు అలుగు ఉదృతంగా పారుతోంది. గురువారం మండల పరిధిలో భారీ వర్షాలు కురియడంతో మండలంలోని వాగులు వంకలు చెరువులు పూర్తిస్థాయిలో నిండుకుని ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. అందులో భాగంగా కిష్టారం పోతిరెడ్డి చెరువు కూడా పూర్తిస్థాయిలో నిండుకుని అలుగు పారుతోంది.
ASF: మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. జిల్లాలో 32 మద్యం షాప్‌ల కోసం అబ్కారీ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఈనెల 18తో గడువు ముగియనుంది. ఆసిఫాబాద్ 6 దుకాణాలకు 12 దరఖాస్తులు రాగా వాంకిడిలో 2 దుకాణాలకు 20, తీర్యాణి 1, గోయేగాంలో 1 దరఖాస్తు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 34 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
NZB: గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 74,502 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు చెప్పారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు 75,394 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా వస్తుండగా 21 గేట్ల ద్వారా 65,604 క్యూసెక్కులు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో తాజాగా 80.053 TMCల నీరు నిల్వ ఉంది.
NLG: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2025-26 అకాడమిక్‌లో భాగంగా ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-14,17 బాల,బాలికలకు నేడు వెయిట్ లిఫ్టింగ్ సెలక్షన్ పోటీలు నిర్వహించనున్నారు. నల్గొండ పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం పై అంతస్తులో నిర్వహించనున్నట్లు SGF కార్యదర్శి విమల తెలిపారు. ఆయా పాఠశాలల్లో వెయిట్ లిఫ్టింగ్ పై ఆసక్తి ఉన్న విద్యార్థులను పంపించాలని కోరారు.
ఖమ్మం జిల్లాలో ఇవాల్టి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన రద్దరైంది. ఈ విషయాన్నీ ఆయన పీఎస్ భాస్కర శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. HYDలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల సమావేశం ఉన్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పర్యటనను వాయిదా వేశారు. తిరిగి Dy.Cm జిల్లా పర్యటన నూతన తేదీని త్వరలోనే ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు.
HYD: ఓల్డ్ బోయినపల్లిలోని హస్మత్ పేట్ బోయిన్ చెరువు కట్టపై సీసీ రోడ్డు నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 4న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్‌తో కలిసి రూ. కోటి వ్యయంతో ఈ పనులను ప్రారంభించారు. ఇంకా పూర్తి కాలేదు. ప్రయాణికుల రాకపోకలకు అసౌకర్యంగా మారింది. ఇకనైనా పనులు వేగవంతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
BDK: బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో రెండు బస్సులు ఎదురుగా ఢీ కొన్నాయి. శుక్రవారం ఉదయం సారపాక మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఆర్టీసీ బస్సులు ఢీకొనగా బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు అయ్యాయి. భద్రాచలం నుంచి ఖమ్మంకి వెళ్తున్న బస్సు ఖమ్మం నుంచి భద్రాచలం నుంచి వస్తున్న బస్సు ఢీ కొన్నాయి. గాయాల పాలైన వ్యక్తులను 108ద్వారా భద్రాచలం హాస్పిటల్ తరలించారు.
HNK: జిల్లా కాజీపేట మండల కేంద్రంలో మిత్రుడు ఇంటికి వచ్చిన ఓ ప్రైవేట్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో గురువారం రాత్రి మృతి చెందారు. వరంగల్ నగరానికి చెందిన తిరుమలగిరి రిషికేష్ 22 అనే యువకుడు హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు గురువారం మిత్రుడిని కలవడానికి వచ్చి మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. కాజీపేట పోలీసులు విచారణ జరుపుతున్నారు.
MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలకు గురువారం సాయంత్రానికి 54 టెండర్లు దాక లైనట్టు అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో 28, నారాయణపేట 5, గద్వాల 11, నాగర్ కర్నూలు జిల్లాలో 10 దరఖాస్తులు వచ్చినట్టు పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి దరఖాస్తులు రాలేదన్నారు. రాబోయే రోజుల్లో టెండర్లు పెరిగే అవకాశం ఉందన్నారు.
HNK: ఈ నెల 13న హనుమకొండ ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్క్రిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సర్రు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు apprenticeshipindia.gov.in/mela-registration లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత ధ్రువపత్రాలతో మేళాకు హాజరుకావాలని సూచించారు. ఐటీఐ పాసై 28 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
SDPT: సిద్దిపేట పట్టణంలోని స్థానిక 11కేవీ నాగదేవత ఎక్స్ రోడ్డు ఫీడర్ల మరమ్మతుల కారణంగా ఖాదర్ పుర, నసీర్ నగర్, ఎల్లారెడ్డినగర్, గ్రీన్ కాలనీ, నాగదేవత ఎక్స్ రోడ్డు, హరీశ్ రావు నగర్, గాడిచర్లపల్లి, రెడ్డికాలనీ, ఇస్లామియా కళాశాల ప్రాంతాలలో శుక్రవారం ఉ. 9 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అసిస్టెంట్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తెలిపారు.
NRPT: మక్తల్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం కురిసిన వర్షం రైతులను నిండా ముంచింది. మండలంలోని సంగంబండకి చెందిన ప్రభాకర్ రెడ్డి 18ఎకరాల్లో వరి పంట వేశాడు. నిన్న కురిసిన వర్షానికి పంట మొత్తం నేలరాలింది. రూ.5లక్షల పెట్టుబడితో ఆరుగాలం శ్రమించి వేసుకున్న పంట చేతికొచ్చే దశలో నేలరాలిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.