MNCL: పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణలో జన్నారం మండల అటవీశాఖ ఎఫ్డీవో రామ్మోహన్ రావు కీలకపాత్ర పోషిస్తున్నారు. అటవీశాఖ అధికారిగా విధులను నిర్వహిస్తూనే, ప్రింట్, ప్రచార సాధనాలలో తన వ్యాసాలతో ఆయన పర్యావరణ ప్రేమికుడిగా గుర్తింపు పొందారు. ప్రముఖ దినపత్రికలు, మ్యాగ్జైన్లలో 80కుపైగా పర్యావరణ వ్యాసాలను రాశారు. పలు టెలివిజాలలో 25కు పైగా ఇంటర్వ్యూలు ప్రసారం అయ్యాయి.