WGL: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వరంగల్ పరిధిలోని మండిబజార్ ప్రాంతంలో పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రజల రద్దీ అధికంగా ఉండటంతో పాటు శాంతి భద్రతలో భాగంగా ఏసీపీ స్థాయి పోలీస్ అధికారులు, స్థానిక పోలీసులు, ప్రత్యేక పోలీసులు ఈ ప్రాంతంలో పహారా కాస్తున్నారు.