SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ హై స్కూల్లో అటెండర్‌గా పని చేస్తున్న బండి రాకేష్ విద్యార్థితో కలిసి మంగళవారం పాఠశాల ఆవరణలో మద్యం సేవిస్తూన్న ఫోటోలు డిఈఓ జనార్ధనరావు దృష్టికి వెళ్లాయి. దీంతో స్పందించిన డీఈవో పాఠశాల హెచ్ఎం జితేందర్‌తో మాట్లాడి అటెండర్‌ను తొలగించాలని మౌఖికంగా ఆదేశించడంతో, అటెండర్‌ను విధులనుండి తొలగించినట్లు హెచ్ఎం తెలిపారు .