BHPL: వైద్యాధికారి డా. మధుసూదన్ కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. నేడు తన కార్యాలయంలో జరిగిన సమీక్షలో, జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సర్వేకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో, వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం రూ.12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.