ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పితంపురాలోని గురుగోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లైబ్రరీలో మంటలు చెలరేగాయి.12 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నించారు. కానీ అప్పటికే చాలా వరకు లైబ్రరీలోని పుస్తకాలు, సామాగ్రి మొత్తం కాలిబూడిదయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.