WNP: మదనాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆత్మకూర్, అమరచింత, కొత్తకోట, మదనాపూర్ నాలుగు మండలాలకు చెందిన వ్యవసాయ ఇన్పుట్ డీలర్లకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు విక్రయించే డీలర్లకు రాబోయే సాగు కాలానికి అనుసరించవలసిన నిబంధనలు, మార్గదర్శకాలను వ్యవసాయ అధికారులు వివరించారు.