NGKL: జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల పరిధిలోని ప్రసిద్ధ దోమల పెంట శివాలయాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆ శివుడి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కాంక్షించారు.