కృష్ణా: నూతనంగా ఎన్నికైన ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు టీడీపీ గ్రామశాఖ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ను గొల్లపూడిలోని గురువారం ప్రత్యేకంగా కలిశారు. ఎమ్మెల్యే వారిని ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ సమన్వయంతో ఐకమత్యంగా కృషి చేయాలని కోరారు.