NLR: ఏఎస్ పేట మండలం చిరమణ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ సైదులు తన సిబ్బందితో కలిసి దాడి చేసి వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 88,680 నగదు, ఐదు బైక్లు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.