అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ముస్లిం వ్యక్తి ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు.. కానీ దానికి సరైన కారణం ఉండాలని పేర్కొంది. భార్యలందరినీ అతడు సమానంగా చూసుకోవాలని తీర్పు చెప్పింది. ముస్లిం చట్టాల ప్రకారం ఇస్లాంలో కొన్ని సందర్భాల్లో ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే సౌలభ్యం ఉన్నట్లు కోర్టు తెలిపింది.