NLR: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గురువారం నెల్లూరు నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు. ప్రస్తుత రాజకీయ అంశాల గురించి ఇరువురు చర్చించుకున్నారు.