BHNG: యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా మహా గణపతి హోమం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. హోమంలో పాల్గొనే దంపతులు రూ.1,500 టికెట్ పొంది సాంప్రదాయ దుస్తులతో పాల్గొనవచ్చును. అభిషేకం లడ్డు, శల్లా, కనుము స్వామివారి ప్రసాదంగా అందజేస్తారు.