NLG: దేవరకొండ ఆర్టీసీ డిపో నుంచి సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని దేవరకొండ నుంచి కాళేశ్వరం వరకు డీలక్స్ బస్సు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఛార్జి రూ.1,500 కాగా, కాళేశ్వరం వద్ద పుష్కర స్నానం, ముక్తేశ్వర స్వామి దర్శనం, వరంగల్ భద్రకాళి టెంపుల్, హనుమకొండ వేయి స్తంభాల గుడి దర్శనం ఉంటుందని తెలిపారు. రద్దీకి అనుగుణంగా బస్సు నడుస్తుందన్నారు.