కృష్ణా: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కీలక పరిణామం చోటుచేసుకుంది. నూజివీడు కోర్టు ఆయనపై పీటీ వారెంట్ జారీకి అనుమతి ఇచ్చింది. ఈ నెల 19లోపు వంశీని కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బెయిల్ వచ్చినా విడుదల కాలేదు. పోలీసులు రేపు వంశీని నూజివీడు కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.