KMR: ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దశరథ్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ నిర్వహించనున్న సమ్మెను అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలపాలన్నారు.